ప్రేమ కథా చిత్రంగా కడసీ బెంచ్ కార్తీ | Kadaisi Bench Karthi love story movie | Sakshi
Sakshi News home page

ప్రేమ కథా చిత్రంగా కడసీ బెంచ్ కార్తీ

Published Sun, Nov 6 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ప్రేమ కథా చిత్రంగా కడసీ బెంచ్ కార్తీ

ప్రేమ కథా చిత్రంగా కడసీ బెంచ్ కార్తీ

 ఈ తరం ప్రేమ గురించి చర్చించే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం కడైసీ బెంచ్ కార్తీ అని చిత్ర దర్శకుడు రవి భార్గవన్ అంటున్నారు.ఇంతకు ముందు వెల్డన్, ఒరు కాదల్ సెయ్‌వీర్, తిరురంగా చిత్రాలతో పాటు తెలుగులో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కడైసీ బెంచ్ కార్తీ. భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని దక్షిణ తూర్పు దేశాల్లోనూ వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్న సుధీర్ పూతోట చిత్ర రంగంలోకి ప్రవేశించి రమారీల్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ఇది. భరత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా పంజాబ్ మ్యూజిక్ ఆల్బం స్టార్ నటి, ప్రముఖ మోడల్ రూహనీవర్ష నాయకిగా పరిచయం అవుతున్నారు.
 
 మరో నాయకిగా కంగనారాయ్ నటిస్తున్న ఈ చిత్రంలో రవిమరియ, జ్ఞానసంబంధం, సనా, సురేఖ, వాణి, దర్శకుడు కాళీ, మూనార్ డేవిడ్, మధురై వినోద్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.అన్భు రాజేశ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ స్మార్ట్ ఫోన్ సంస్కృతి ఎక్కువవుతున్న ఈ నాగరిక ప్రపంచంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అలాంటి ఈ మోడ్రన్ ప్రపంచంలో స్థిరత్వాన్ని కోల్పోతున్న వాటిలో ప్రేమ ఒకటన్నారు. ప్రేమకు నిజమైన నిదర్శనం ఏమిటీ.అసలు ఈ తరం యువతలో ప్రేమపై నమ్మకం ఉందా?లాంటి పలు అంశాలను చర్చించే చిత్రంగా కడైసీ బెంచ్ కార్తీ ఉంటుందని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement