![Love Story Movie Naga Chaitanya And Sai Pallavi In Bigg Boss Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/19/Naga-Chaitanya-Sai-Pallavi-.jpg.webp?itok=PftyMfWV)
‘లవ్‌స్టోరీ’లో సాయి పల్లవి, నాగచైతన్య
బిగ్‌బాస్ సీజన్ 4 ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. రేపే గ్రాండ్ ఫినాలే. విజేత ఎవరో ప్రకటించే రోజు. ప్రతీ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కి హోస్ట్‌తో పాటు ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్‌గా వస్తుంటారు. సీజన్ 3 ఫైనల్‌కి నాగార్జునతో కలసి చిరంజీవి సందడి చేశారు. ఈసారి నాగార్జునతో పాటు ఫైనల్‌లో సందడి చేయడానికి ‘లవ్‌స్టోరీ’ జంట రాబోతున్నారని తెలిసింది. నాగచైతన్య, సాయి పల్లవి ఈ సీజన్ ముఖ్య అతిథులుగా ఫైనల్ ఎపిసోడ్‌లో పాల్గొంటారట. ‘లవ్‌స్టోరీ’ సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరే కాకుండా పలువురు హీరోయిన్లు కూడా కనిపిస్తారట. లక్ష్మీ రాయ్, మెహరీన్‌లతో పాటు ఇంకొంతమంది హీరోయిన్ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుందని తెలిసింది.
∙
Comments
Please login to add a commentAdd a comment