దుబాయ్‌ ప్రయాణం | Naga Chaitanya Love story movie shooting at Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ ప్రయాణం

Published Thu, Feb 20 2020 12:12 AM | Last Updated on Thu, Feb 20 2020 12:12 AM

Naga Chaitanya Love story movie shooting at Dubai - Sakshi

నాగచైతన్య, సాయి పల్లవి

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. నారాయణ్‌ దాస్, పి. రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ దుబాయ్‌లో జరగనుంది. ఈ నెల 21 నుంచి నెలాఖరు వరకూ దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుతారు. ఈ షెడ్యూల్‌లో ఓ పాటను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట చిత్రబృందం. ఈ సినిమాలో తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు నాగచైతన్య. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకి సంగీతం: పవన్, కెమెరా: విజయ్‌ సి.కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement