బర్త్‌డే స్పెషల్‌ : నాగ చైతన్య న్యూ లుక్ | Naga Chaitanya  Birthday love story special poster | Sakshi
Sakshi News home page

బర్త్‌డే స్పెషల్‌ : నాగ చైతన్య న్యూ లుక్

Nov 23 2020 2:36 PM | Updated on Nov 23 2020 2:52 PM

Naga Chaitanya  Birthday love story special poster - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  యువ సామ్రాట్‌  అక్కినేని నాగ చైతన్య  పల్లెటూరి గెటప్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చేతూ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''లవ్ స్టోరి'' స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. లుంగీ, బనియన్‌తో  పల్లెటూరి యువకుడి పాత్రలో నాగ చైతన్య  లుక్  అభిమానులను ఆకట్టుకుంటోంది. 

కొందరితో స్నేహాలు చాలా బావుంటాయి.  చైతూతో అసోసియేషన్ అలాంటిదే.. థ్యాంక్యూ.. హ్యాపీ బర్త్ డే చైతన్య'' అంటూ 'లవ్ స్టోరి''  చిత్ర దర‍్శకుడు శేఖర్ కమ్ముల  చేకు శుభాకాంక్షలు  తెలిపారు. నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగ చైతన్య  తన శ్రీమతి, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతా అక్కినేనితో  కలిసి మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్నారు. అయితే తన హబ్బీ పుట్టినరోజు సందర్భంగా, సమంతా బీచ్‌లో ఎంజాయ్‌  చేస్తున్న అద్భుతమైన  ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్  స్టోరీలో  షేర్‌ చేశారు.  అంతకుముందు స్కూబా డైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. 


.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement