
టిక్‌టాక్ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ భూమ్మీదే కాదండోయ్...అంతరిక్షంలోనూ ట్రెండ్ సెట్ చేస్తుంది.
ఇటలీకి చెందిన 45ఏళ్ల యురేపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫోరెట్టి టిక్‌టాక్ వీడియోలతో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న అంతరిక్షంలో ఉన్న ఈఎస్‌ఏకి చెందిన ఆర్బిటింగ్ ల్యాబ్‌కు చేరుకున్నారు. 6నెలల పాటు అక్కడ ఉండనున్నారు. అనంతరం భూమ్మీదకు చేరుకోనున్నారు.
Back on the International @Space_Station (and TikTok) pic.twitter.com/oCgJSdWKcu
— Samantha Cristoforetti (@AstroSamantha) May 6, 2022
అయితే ఈ నేపథ్యంలో ఈఎస్‌ఏ నుంచి 88 సెకన్ల టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియోలో స్పేస్‌ఎక్స్‌ఎస్ క్రూ-4 మెషిన్‌లో భాగంగా టూ 'జీరో - జీ ఇండికేటర్స్' తో పాటు ఎట్టా అనే మంకీ బొమ్మ గురించి వీడియోలో పేర్కొన్నారు. సమంతా తీసిన టిక్ టాక్ వీడియోను 2లక్షల మందికి పైగా వీక్షించగా..8వేల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన టిక్‌టాక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment