న్యూఢిల్లీ: భారత్‌లో నిషేదించిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా భారతదేశంలో బైట్‌డ్యాన్స్ బ్యాంకు ఖాతాలను ప్రభుత్వ అధికారులు స్తంభింపజేశారు. బైట్‌డ్యాన్స్ మాత్రం ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది భారతదేశం, చైనా మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణ తర్వాత భద్రతా కారణాల రీత్యా కేంద్రం టిక్‌టాక్‌ను నిషేదించింది.
ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించిన తర్వాత జనవరిలో బైట్‌డాన్స్ భారత ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించింది. అయితే, చైనా యాప్స్ విషయంలో భారతదేశం తీసుకున్న చర్యను చైనా పదేపదే విమర్శిస్తూ.. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. బైట్‌డాన్స్‌లో ఇప్పటికీ సుమారు 1,300 మంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విదేశీ కార్యకలాపాలకు సేవలు అందిస్తున్నారు. మార్చి మధ్యలో సిటీబ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలోని రెండు బైట్‌డాన్స్ ఇండియా బ్యాంక్ ఖాతాలను భారత బైట్‌డాన్స్ యూనిట్, సింగపూర్‌లోని దాని మాతృ సంస్థ టిక్‌టాక్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఆన్‌లైన్ ప్రకటనల వ్యవహారాల్లో కొన్ని పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు బైట్‌డ్యాన్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment