
‘‘అందరూ కొత్తవాళ్లు తీసిన ‘తీరం’ సినిమా బాగా వచ్చింది. ప్రశాంత్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. మా సినిమా హిట్ అవుతుంది’’ అని నిర్మాత యం. శ్రీనివాసులు అన్నారు. శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్లుగా అనిల్ ఇనమడుగు దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. యం. శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో, దర్శకుడు అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘తీరం’. అందరం దమ్మున్న సినిమా చేశాం’’ అన్నారు. ‘‘మంచి పాత్ర చేశా’’ అన్నారు శ్రావణ్ వైజిటి.