Singapore TikTok Dance Bole Chudiyan Song Like Kareena Kapoor Viral Video - Sakshi
Sakshi News home page

TikTokers: కరీనా స్టెప్పులు దించేశారు.. వీడియో వైరల్‌

Published Sat, Nov 6 2021 7:36 PM | Last Updated on Sat, Nov 6 2021 8:34 PM

Singapore TikTok Dance Bole Chudiyan Song Like Kareena Kapoor Viral Video.Singapore TikTok Dance Bole Chudiyan Song Like Kareena Kapoor Viral Video. - Sakshi

Singapore Tiktok Users Recreating Popular Song Bole Chudiyan Video: కభీ ఖుషీ కభీ గమ్ హింది సినిమాలోని పాటలు ఒక్కడో ఒకచోట వినబడుతునే ఉంటాయి! ‘బోలే చుడియన్’ పాట అయితే వివాహవేడుకలు, పార్టీల్లో మారుమోగుతునే ఉంటుంది! తాజాగా సింగాపూర్‌కు చెందిన ఓ టిక్‌టాక్‌ బృందం ‘బోలే చుడియన్‌’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఒరిజినల్‌ పాటలో హీరో, హీరోయిన్లు చేసినట్లుగానే తమ నృత్యంతో అచ్చం దించేశారు. అయితే ప్రస్తుతం వారు చేసిన ఈ పాట డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒరిజినల్‌ పాటలోని కొరియోగ్రఫీకి తగినవిధంగా పాటలోని మొత్తం స్టెప్పులన్నీ అంతే గ్రేస్‌తో చేశారు. పాటలోని హావభావాలను కూడా హీరోహీరోయిన్లకు తగ్గకుండ పాలికించారు. ఈ పాటలో కరీనా కపూర్‌, హృతిక్‌ రోషన్‌, షారుక్‌ ఖాన్‌, కాజోల్‌ స్టెప్పులు వేస్తారు. ఓ నెటిజన్‌ ఈ వీడియోను తన ట్విటర్‌లో ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మంది వీక్షించారు. ‘బ్రిలియంట్‌ కొరియోగ్రఫీ, అద్భుతంగా చేశారు’.. ‘కరీనా కపూర్‌ను అనుకరిస్తూ డ్యాన్స్‌ భళే చేశాడు’అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో జూనియర్‌ ఎన్టీర్‌ ఆశోక్‌ చిత్రంలోని ‘గోలా గోలా రంగోలా’ అనే  పాటకు ఓ జపాన్‌ జంట డ్యాన్స్‌ చేసి వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement