ఇస్లామాబాద్: రెండుసార్లు తన టిక్‌టాక్ ఖాతాను నిషేధించడంపై శృంగార తార మియా ఖలీఫా ఫైరయ్యింది. తన ఖాతాలను నిలిపేయడంపై మండిపడింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై మండిపడుతూ ట్వీట్లు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో ఒకసారి మియా ఖలీఫా టిక్‌టాక్ అకౌంట్‌ను నిలిపివేయగా తాజాగా ఏప్రిల్‌లో మళ్లీ నిషేధించింది. దీంతో ఈ హాట్ భామకు కోపమొచ్చింది. అనైతికంగా.. అకారణంగా టిక్‌టాక్ అకౌంట్ నిలిపివేసిందని వాపోయింది.
‘నా టిక్‌టాక్ అకౌంట్ పాకిస్తాన్ బ్లాక్ చేసింది. ఇప్పటి నుంచి నా టిక్‌టాక్ వీడియోలు ట్విటర్‌లో పోస్తుంటా. పాకిస్తాన్ అభిమానులు చూసేయచ్చు’ అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆమె అకౌంట్‌పై నిషేధం విధిస్తూ పాకిస్తాన్ టెలీ కమ్యూనికేషన్ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని తెలుస్తోంది. ఎందుకు ఆమె ఖాతాపై నిషేధం విధించారో తెలియడం లేదు. మియా ఖలీఫాకు టిక్‌టాక్‌లో భారీగా ఫాలోవర్లు ఉన్నారు. 22.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, 270 మిలియన్ల లైక్‌లు ఉన్నాయి.
Shoutout to Pakistan for banning my tiktok account from the country. I’ll be re-posting all my tiktoks on Twitter from now on for my Pakistani fans who want to circumvent fascism 💕
— Mia K. (@miakhalifa) May 22, 2021
Comments
Please login to add a commentAdd a comment