ఇస్లామాబాద్: దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్ యాప్‌తో సహా పలు చైనా యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారు. అమెరికా లాంటి దేశాలలో కూడా టిక్‌టాక్ నిషేధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఇక ఇప్పుడు టిక్‌టాక్‌కు మరో భారీ షాక్ తగిలింది. చైనాకు అత్యంత సాన్నిహిత్యంగా ఉండే పాకిస్తాన్‌లో కూడా టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసినట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసభ్యంతరకరమైన, అసహ్యమైన కంటెంట్‌ను టిక్‌టాక్‌లో షేర్ చేస్తున్నారని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అధారిటీ వెల్లడించింది. ఈ కారణంతో టిక్‌టాక్‌ను బ్లాక్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించి టిక్‌టాక్‌కు ఇంతముందే సమయం ఇచ్చిన ఇప్పటి వరకు స్పందించలేదని అందుకే బ్యాన్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment