ఇండియాలో టిక్‌టాక్ వినియోగంలో ఉన్నపుడు దానికి వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను మన దేశంలో నిషేధించాక, వినియోగదార్లు ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను తీసుకొచ్చింది. 2020 జులైలో తొలుత భారత్‌లోనే వీటిని పరిచయం చేసింది. భారత్‌లో రీల్స్‌కు వస్తున్న ఆదరణను గమనించిన మెటా, ఈ డేటాను భద్రపరచేందుకు మనదేశంలోనే డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది.
ఈ డేటా సెంటర్లలో 10-20 మెగావాట్‌ల సామర్థ్యం కలిగిని చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెటా అవకాశాలను పరిశీలిస్తోందని తెలిసింది. ఈ డేటా కేంద్రం ఏర్పాటుకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వంటి విషయాలు కంపెనీ నిర్వహిస్తున్న అధ్యయనం తర్వాత తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ నిపుణుల ప్రకారం, టైర్-4 డేటా కేంద్రం మన దేశంలో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.50-60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి
Comments
Please login to add a commentAdd a comment