సాక్షి,ముంబై: సోషల్ మీడియా సంస్థ, ఇండియాలో బ్యాన్ అయిన టిక్‌టాక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించింది. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తున్న వారినందరికి ఉద్వాసన పలికింది. ఫలితంగా దాదాపు 40మంది ప్రభావితంకానున్నారు. నిషేధం తరువాత భారత్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో టిక్‌టాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మూడు సంవత్సరాల క్రితం నిషేధానికి గురైన టిక్‌టాక్ ఆఫీసులను కూడా మూసివేయనుంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్ ఈ వారం 40 మందికి పింక్ స్లిప్‌లను అందించింది. తొలగించిన ఉద్యోగులకు తొమ్మిది నెలల జీతాన్ని చెల్లిస్తామని పేర్కొంది తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్‌కు సపోర్ట్ కోసం 2020లో భారత్‌లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్ట్ హబ్‌ను మూసివేయాలని నిర్ణయించామని టిక్‌టాక్ ప్రతినిధి ఒ‍్క ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు గత ఏడాది అమెరికాలోనూ అన్ని ఫెడరల్ ప్రభుత్వ డివైస్‌లలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఆమోదించింది. టిక్‌టాక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుపై ఈ నెలలో ఓటింగ్ నిర్వహించాలని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ యోచిస్తోంది. భారత్‌లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్‌టాక్ ఇప్పటికీ భారత్‌లో కార్యాలయాన్ని కొనసాగిస్తోంది. భారత్ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కట్ల కోసం పనిచేస్తున్నారు.తాజాగా వీరందరికి ఉద్వాసన పలికింది.
చైనా కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను సరిహద్దు ఉద్రిక్తతలు, జాతీయ భద్రత కారణాలతో 2020లో కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment