
బీజింగ్: సాధారణంగా కొత్త సిమ్ కొనాలంటే సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించి బయోమెట్రిక్ స్కాన్, తగిన రుసుం చెల్లిస్తే చాలు. కానీ చైనాలో అలా కాదు. ధ్రువీకరణ పత్రాలతో పాటుగా ముఖాన్ని స్కాన్ చేయించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ముఖాన్ని చుట్టూ స్కాన్ చేయడంతో పాటు.. కళ్లు మూయడం, తెరవడం వంటివి కూడా పూర్తయ్యాకే సిమ్ దక్కుతుంది. ఈ మేరకు నిబంధనలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తూ చైనా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ వాడే వారు తమ ఫోన్ల రిజిస్ట్రేషన్‌లో అసలు పేరునే వినియోగించాలంటూ గత సెప్టెంబర్‌లో నిబంధనలు తెచ్చింది. ఈ చర్యలన్నీ ఆన్‌లైన్ ప్రపంచంలో ప్రజల హక్కులను కాపాడటం కోసమేనని ప్రభుత్వం అంటోంది.