
చైనాతో పెరిగిన భారత వాణిజ్య లోటు
చైనాతో భారత వాణిజ్య లోటు గత ఏడాది 4,487 కోట్ల డాలర్లకు పెరిగిందని చైనా ప్రభుత్వం తెలిపింది. ఎగుమతులు 1,338 కోట్ల డాలర్లకు తగ్గాయని పేర్కొంది.
బీజింగ్: చైనాతో భారత వాణిజ్య లోటు గత ఏడాది 4,487 కోట్ల డాలర్లకు పెరిగిందని చైనా ప్రభుత్వం తెలిపింది. ఎగుమతులు 1,338 కోట్ల డాలర్లకు తగ్గాయని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం స్వల్పంగా పెరిగి 7,164 కట్ల డాలర్లకు చేరిందని, 10,000 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని చేరలేకపోయిందని వివరించింది. చైనా ఎగుమతులు 5,825 కోట్ల డాలర్లకు పెరిగాయని తెలిపింది. 2014లో 1,640 కోట్ల డాలర్లుగా ఉన్న చైనాకు భారత్ ఎగుమతులు గత ఏడాది 1,338 కోట్ల డాలర్లకు తగ్గాయని వివరించింది.