చైనా మార్కెట్లకు ప్రభుత్వం బూస్ట్ | In China markets Government boost | Sakshi
Sakshi News home page

చైనా మార్కెట్లకు ప్రభుత్వం బూస్ట్

Published Fri, Aug 7 2015 12:35 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

చైనా మార్కెట్లకు ప్రభుత్వం బూస్ట్ - Sakshi

చైనా మార్కెట్లకు ప్రభుత్వం బూస్ట్

- రెండు నెలల్లో షేర్లపై 147 బిలియన్ డాలర్ల వెచ్చింపు
- స్టాక్స్ ధరల పతనాన్ని నిలువరించేందుకే...
షాంఘై:
స్టాక్ మార్కెట్ల పతనాన్ని నిలువరించే దిశగా షేర్ల ధరలకు ఊతమిచ్చేందుకు చైనా ప్రభుత్వం గత రెండు నెలల్లో ఏకంగా 900 బిలియన్ యువాన్లు (147 బిలియన్ డాలర్లు, దాదాపు రూ. 9 లక్షల కోట్లు) వెచ్చించింది. మార్కెట్లకు సహాయక ప్యాకేజీ కింద.. స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ చైనా సెక్యూరిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (సీఎస్‌ఎఫ్) తదితర సంస్థలకు నిధులందించింది. అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు గోల్డ్‌మన్ శాక్స్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. జూన్ మధ్యలో గరిష్ట స్థాయికి చేరిన షాంఘై మార్కెట్ ఆ తర్వాత మూడు వారాల్లోనే 30 శాతం పైగా క్షీణించిన సంగతి తెలిసిందే. దీంతో పతనానికి అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రభుత్వం 2 లక్షల కోట్ల యువాన్లను పక్కన ఉంచినట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement