► ఎంజీఎంలో అక్రమాలపై విజిలెన్స్ నివేదిక
► చర్యలు తీసుకోవాలని డీఎంఈకి ప్రభుత్వ ఆదేశం
► చర్యలలో జాప్యంపై లోకాయుక్తలో ఫిర్యాదు
► డీఎంఈ, ఎంజీఎం సూపరింటెండెంట్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో పేరొందిన మహాత్మాగాంధీ స్మారక ఆసుపత్రి (ఎంజీఎం)లో గతంలో వెలుగుచూసిన ఆక్సిజన్ సిలిండర్ల అక్రమాల వ్యవహారం లోకాయుక్తకు చేరింది. కోట్ల రూపాయల అక్రమాలు జరిగినా బాధ్యులపై చర్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తు న్నారనే ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది. అక్రమాలపై చర్యల విషయంలో వైద్య విద్య సంచా లకుడు, ఎంజీఎం సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న కేసు విచారించనున్న ట్లు తెలిపింది. ఆ రోజులోపు ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఒక్కో సిలిండర్‌పై రూ.155 అదనం!
మహాత్మాగాంధీ స్మారక ఆసుపత్రిలో సగటున రోజుకు 70–80 ఆక్సిజన్ సిలిండర్లు అవసరమ వుతాయి. ఆసుపత్రి రికార్డుల ప్రకారం... 2007–13 మధ్య మొత్తం 1,35,744 సిలిండర్లు హన్మకొండకు చెందిన తులసీ ఏజెన్సీ నుంచి కొనుగోలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు రూ.230కు సిలిండర్‌ను సరఫరా చేసిన కాంట్రాక్టర్... ఎంజీఎంకు రూ.385 చొప్పున అంటగట్టిన వ్యవహారం 2014లో వెలుగులోకి వచ్చింది. ఒక్కో సిలిండర్‌పై రూ.155 చొప్పున సర్కారుకు నష్టం వాటిల్లింది. ఆరేళ్లు సాగిన ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఇదీ చాలదన్నట్లు సిలిండర్లకు రోజుకు రూ.26 చొప్పున అద్దె సైతం చెల్లించింది. ఈ ఆరోపణలపై విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరిపింది. 2016 ఏప్రిల్ 21న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాకు బిల్లు చెల్లింపులో ప్రభుత్వానికి రూ.2,30,92,275 నష్టం జరిగిందని నిర్ధారించింది. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని 2016 నవంబర్‌లో వైద్య విద్య సంచాలకుడిని ఆదేశించింది. అయినా చర్యలు తీసుకోకపోవడంపై వైద్య విద్య సంచాల కుడు, ఎంజీఎం సూపరింటెండెంట్ ఎలాంటి చర్య లు తీసుకోవడంలేదని వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి ఆగస్టు 21న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోకాయుక్త... బాధ్యులకు నోటీసులు ఇచ్చింది.
రూ.2.3 కోట్ల ఆక్సిజన్ దందా
Published Fri, Sep 1 2017 2:15 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM
Advertisement
Advertisement