
మనమేమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా?
ఢిల్లీ: భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడాన్ని సామాజిక ఉద్యమకర్త మేథా పాట్కర్ వ్యతిరేకించారు. కేంద్రం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కారు ఆరు నెలల కాలంలో మూడు ఆర్డినెన్సులు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మనమేమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా అని ట్విటర్ లో ప్రశ్నించారు.
కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టంలో మార్పులు చేస్తోందని ఆమె ఆరోపించారు. కేవలం భూసేకరణ చట్టం వల్లే 20 లక్షల రూపాయల పెట్టుబడులు ఆగిపోయాయనడం సరికాదని మేథాపాట్కర్ పేర్కొన్నారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందన్నారు.