సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో బుధవారం సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు భూ సేకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు.
మూడు పంటలు పండే జరీ భూములను మెట్ట భూములుగా చూపించడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రైతులు అడిగిన ప్రశ్నలకు సీఆర్‌డీఏ అధికారులు నోరు మెదపలేదు. దీంతో అధికారులు తీరుపై రైతులు మండిపడుతున్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మీటింగులు పెట్టొద్దంటూ రైతులు అధికారులకు తేల్చి చెప్పారు.