అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన సీఆర్‌డీఏ సదస్సు రసాభాసగా మారింది. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో సీఆర్డీఏ అధికారులు రాజధాని నిర్మాణంపై రైతులతో సదస్సును చేపట్టారు.
ఈ సదస్సులో రైతులు అధికారులను నిలదీశారు. గ్రామ కంఠాల విషయంలో స్పష్టత ఇవ్వాలని రైతులు ఆందోళన చేయడంతో సదస్సు రసాభసగా ముగిసింది. కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చినప్పడు చెప్పిన మాటలకు... ఇప్పుడు అధికారులు చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. భూములు తీసుకున్నప్పుడు వచ్చిన మంత్రులు... ఇప్పడు గ్రామాలకు ఎందుకు రావడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నచ్చజెప్పేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది.
సీఆర్డీఏ అధికారులను నిలదీసిన రాజధాని రైతులు
Published Tue, Jan 12 2016 7:33 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement