సీఆర్డీఏ తీరుపై రైతుల ఆగ్రహం
Published Tue, Aug 1 2017 1:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
అమరావతి: ఏపీ రాజధానిలో సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్ళూరు మండలం లింగాయపాలెంలో భూసేకరణపై రైతుల అభ్యంతరాలకు పరిష్కారం చూపేందుకు సీఆర్‌డీఏ అధికారులు సమావేశం నిర్వహించారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం రైతులతో సమావేశాన్ని నిర్వహించేందుకు వచ్చిన సీఆర్‌డీఏ డిప్యూటి కలెక్టర్ ఒక్కొక్క రైతును తన గదిలోకి పిలిచి మీ అభ్యంతరాలు తెలుసుకున్నారు. దీంతో 2013 భూసేకరణ చట్టానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని రైతులు మండిపడ్డారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ సమావేశాన్ని వాయిదా వేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.
Advertisement