ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి... | yanamala ramakrishnudu reacts on pawan kalyan twits | Sakshi
Sakshi News home page

ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి...

Published Wed, Aug 19 2015 1:30 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి... - Sakshi

ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి...

హైదరాబాద్ : భూ సేకరణ చట్టం అమలుపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దంటున్న పవన్ కల్యాణ్ .... ఏం చేయాలో కూడా చెబితే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పరిహారం కోరాలి కానీ ...భూ సేకరణ వద్దంటే ఎలా అని యనమల ప్రశ్నించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, బేతపూడి గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని పవన్ సూచించిన విషయం తెలిసిందే. మరోవైపు  రాజధాని ప్రాంతంలో  ఈ నెల 20 నుంచి భూసేకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బలవంతంగా భూసేకరణ చట్టాన్ని అమలు చేయరాదని, రైతుల నుంచి భూములు లాక్కోవద్దని పవన్ ...ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement