హైదరాబాద్ : భూ సేకరణపై సిననటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్ చేశారు. రాజధాని పరిధిలోని గ్రామాల భూములను భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకోవద్దని ఆయన ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ట్విట్ చేశారు.
ఏడాదికి మూడు పంటలు పండే పెనుమాక, ఉండవల్లి, బేతపూడితోపాటు ఇతర గ్రామాల భూముల విషయంలో భూ సేకరణ చట్టాన్ని వినియోగించవద్దని ఆయన సూచించారు. తక్కువ నష్టంతో ఎక్కువ అభివృద్ధి జరగాలని, పాలకులు వివేకంతో ఆలోచించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని కోసం ఇంకా సేకరించాల్సిన భూమి విషయంలో 'భూసేకరణ చట్టాన్ని' వినియోగించవద్దని టీడీపీ ప్రభుత్వాన్నికోరుతూ పవన్ గతంలోనూ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.
on Fertile Multi cropped Lands of Undavalli,Penumaka,Bethapudi..& other River front villages.
— Pawan Kalyan (@PawanKalyan) August 19, 2015
I urge Hon'ble CM of AP ..Sri CBN garu not to Use 'Land acquisition act'
— Pawan Kalyan (@PawanKalyan) August 19, 2015