భూసేకరణ చట్ట సవరణలివే..
మొత్తం ఐదింటికి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సూచిం చిన మూడు సవరణలతో భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదించింది. అభివృద్ధి పనుల భూసేకరణలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణ ప్రయో జనం కలిగించేందుకు ఈ బిల్లును తీసుకొ చ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదిస్తూ కొన్ని సవరణలను సూచిం చింది.
ప్రాజెక్టులు, ఇతర ప్రజోపయోగమైన అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సామాజిక ప్రభావ అంచనా(సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్) పేరిట కాలయాపన లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. ఇందుకు చట్టంలోని కొన్ని సాంకేతిక అంశాలను.. అది కూడా పదాల కూర్పులో కొన్ని మార్పులను సూచించింది.
బిల్లులో పేర్కొన్న ముఖ్యమైన అంశాలపై కేంద్రం సానుకూలంగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం సూచించిన మేరకు మూడు సవరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింటికి భూసేకరణ చట్టంలో చోటు కల్పించేందుకు సాంకేతిక కారణాలతో మరో రెండు చిన్న సవరణలను జోడించింది.
మొదటి సవరణ
ఇది టైటిల్‌లో పదాల మార్పునకు ఉద్దేశించి నది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకు విఘా తం కలగకుండా చట్టం అమలు చేసేందుకు టైటిల్‌లో పదాల మార్పు చేసింది.
రెండో సవరణ
ఎప్పట్నుంచి చట్టం అమలవుతుందనే విషయంలో స్పష్టతనిచ్చేందుకు ఈ సవరణ చేశారు. ఈ చట్టం 2014 జనవరి 1 నుంచి గానీ, నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నాటి నుంచి కానీ అమలవుతుందని పాత బిల్లులో పేర్కొన్నారు. 2014 జనవరి 1 నుంచి ఈ చట్టం ప్రకారం భూ సేకరణ జరపాలని నిర్ణయించింది.
మూడో సవరణ
చట్టంలోని క్లాజ్ 6ను తొలిగించింది. 2013 చట్టం ప్రకారం.. కలెక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చే ముందు భూమి ధరను రివైజ్ చేసుకోవాలి. 2016 చట్టంలోని 6వ క్లాజ్ ప్రకారం.. భూమి ధర తెలుసుకుని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలి. చట్టంలో ఈ క్లాజ్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందుకు అనుగుణంగా సవరణ చేశారు.
నాలుగో సవరణ
క్లాజ్ 7, క్లాజ్ 8లో మార్పులు. 2013 చట్టంతో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం లేకుండానే పునరావాసం కోసం పరి హారం ఇవ్వాలి. ప్రభావిత కుటుం బాల జాబితాలో వ్యవసాయాధారిత కూలీలు కూడా ఉంటారు. వారికి కూడా తగిన పరిహారం చెల్లించాలని తాజాగా చేర్చారు.
అయిదో సవరణ
క్లాజ్ 10 తొలగింపు. 2013 చట్టం ప్రకారం.. అత్యవసరం అనుకునే పనుల కోసం కలెక్టర్లు అవార్డు పాస్ చేసి భూ సేకరణ జరపవచ్చు. దానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. ప్రభుత్వ అనుమతి ఉంటే చాలు. 2016 చట్టం ప్రకారం.. 2013 చట్టంలో కల్పించిన వెసులుబాటునే రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచినా.. కేంద్రం ఈ క్లాజ్ అవసరం లేదని చెప్పింది. దీంతో ఈ క్లాజ్ తొలగించారు.