Social Impact Assessment
-
PM Narendra Modi: కలిసి పనిచేద్దాం.. సవాళ్లను ఎదిరిద్దాం
న్యూఢిల్లీ/ఢాకా: ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు ఏర్పడుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార, ఇంధన భద్రత విషయంలో సంక్షోభాలను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామని గ్లోబల్ సౌత్ దేశాలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేతులు కలుపుదామని సూచించారు. శనివారం వర్చువల్గా నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ‘సోషల్ ఇంపాక్ట్ ఫండ్’కు 25 మిలియన్ డాలర్లు అందజేయబోతున్నట్లు ప్రకటించారు. పరస్పర వాణిజ్యం, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడమే లక్ష్యంగా తమ శక్తిసామర్థ్యాలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఐకమత్యంతోనే మన బలం కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని, ఇంతలో యుద్ధాలు ముంచుకొచ్చాయని మోదీ విచారం వ్యక్తంచేశారు. అబివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి సవాళ్లు ఇప్పటికే ఉండగా, టెక్నాలజీకి సంబంధించి కొత్తగా ఆర్థిక, సామాజిక సవాళ్లు మొదలయ్యాయని తెలిపారు. గత శతాబ్దంలో ఏర్పాటైన పాలనా వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు ఈ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించలేకపోతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒక్కటి కావాలన్నారు. ఒకే గళం వినిపించాలని, ఒకరికొకరు తోడుగా నిలవాలని సూచించారు. ఒకరి అనుభవాలను మరొకరు పాఠాలు నేర్చుకోవాలన్నారు. మన ఐకమత్యంలోనే మన బలం దాగి ఉందన్నారు. ఈ ఐకమత్య బలంతో నూతన దశలో ప్రయాణం సాగించాలని పిలుపునిచ్చారు. ‘గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్’ గ్లోబల్ సౌత్ దేశాల ప్రగతి కోసం మానవ కేంద్రీకృత ‘గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్’ ఏర్పాటు చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. భారతదేశ అభివృద్ధి యాత్ర, అభివృద్ధి భాగస్వామ్య అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని వ్యాపారం–వాణిజ్యంతోపాటు సాంకేతికతను పంచుకోవడానికి, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని వెల్లడించారు. భాగస్వామ్య దేశాల సమతుల, సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలపై మరింత అప్పుల భారం పడకుండా ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి 2.5 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నామని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంఘర్షణలు, ఉద్రిక్తతలకు పరిష్కార మార్గాలు సమగ్ర ప్రపంచాభివృద్ధి, సుస్థిర పాలనలోనే ఉన్నాయని తేలి్చచెప్పారు. -
భూసేకరణ చట్ట సవరణలివే..
మొత్తం ఐదింటికి ఆమోదం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సూచిం చిన మూడు సవరణలతో భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదించింది. అభివృద్ధి పనుల భూసేకరణలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణ ప్రయో జనం కలిగించేందుకు ఈ బిల్లును తీసుకొ చ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదిస్తూ కొన్ని సవరణలను సూచిం చింది. ప్రాజెక్టులు, ఇతర ప్రజోపయోగమైన అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సామాజిక ప్రభావ అంచనా(సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) పేరిట కాలయాపన లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. ఇందుకు చట్టంలోని కొన్ని సాంకేతిక అంశాలను.. అది కూడా పదాల కూర్పులో కొన్ని మార్పులను సూచించింది. బిల్లులో పేర్కొన్న ముఖ్యమైన అంశాలపై కేంద్రం సానుకూలంగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం సూచించిన మేరకు మూడు సవరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింటికి భూసేకరణ చట్టంలో చోటు కల్పించేందుకు సాంకేతిక కారణాలతో మరో రెండు చిన్న సవరణలను జోడించింది. మొదటి సవరణ ఇది టైటిల్లో పదాల మార్పునకు ఉద్దేశించి నది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకు విఘా తం కలగకుండా చట్టం అమలు చేసేందుకు టైటిల్లో పదాల మార్పు చేసింది. రెండో సవరణ ఎప్పట్నుంచి చట్టం అమలవుతుందనే విషయంలో స్పష్టతనిచ్చేందుకు ఈ సవరణ చేశారు. ఈ చట్టం 2014 జనవరి 1 నుంచి గానీ, నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నాటి నుంచి కానీ అమలవుతుందని పాత బిల్లులో పేర్కొన్నారు. 2014 జనవరి 1 నుంచి ఈ చట్టం ప్రకారం భూ సేకరణ జరపాలని నిర్ణయించింది. మూడో సవరణ చట్టంలోని క్లాజ్ 6ను తొలిగించింది. 2013 చట్టం ప్రకారం.. కలెక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చే ముందు భూమి ధరను రివైజ్ చేసుకోవాలి. 2016 చట్టంలోని 6వ క్లాజ్ ప్రకారం.. భూమి ధర తెలుసుకుని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలి. చట్టంలో ఈ క్లాజ్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందుకు అనుగుణంగా సవరణ చేశారు. నాలుగో సవరణ క్లాజ్ 7, క్లాజ్ 8లో మార్పులు. 2013 చట్టంతో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం లేకుండానే పునరావాసం కోసం పరి హారం ఇవ్వాలి. ప్రభావిత కుటుం బాల జాబితాలో వ్యవసాయాధారిత కూలీలు కూడా ఉంటారు. వారికి కూడా తగిన పరిహారం చెల్లించాలని తాజాగా చేర్చారు. అయిదో సవరణ క్లాజ్ 10 తొలగింపు. 2013 చట్టం ప్రకారం.. అత్యవసరం అనుకునే పనుల కోసం కలెక్టర్లు అవార్డు పాస్ చేసి భూ సేకరణ జరపవచ్చు. దానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. ప్రభుత్వ అనుమతి ఉంటే చాలు. 2016 చట్టం ప్రకారం.. 2013 చట్టంలో కల్పించిన వెసులుబాటునే రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచినా.. కేంద్రం ఈ క్లాజ్ అవసరం లేదని చెప్పింది. దీంతో ఈ క్లాజ్ తొలగించారు.