ఇష్టారీతిన చట్టాలు చేయడం మానుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చట్టం పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టాలని, ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేయడం, నిర్ణయాలు మార్చుకోవడాన్ని మాను కోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి సూచించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో రాజ్యాంగానికి వ్యతి రేకంగా భూసేకరణ చట్టానికి సవరణ చేశారని విమర్శిం చారు. ఎంతో కసరత్తు చేసి యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తే, దాని లక్ష్యాలకు భిన్నంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడిగా జీవో 123ని తీసుకొచ్చిందన్నారు. ఈ జీవోపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు.