
అసలు మంత్రులకు అవగాహన ఉందా?
2013 భూ సేకరణ చట్టంపై కాంగ్రెస్ నేత భట్టి ప్రశ్న
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ సేకరణ చట్టం 2013పై రాష్ట్ర మంత్రులలో అనేక మందికి కనీస అవగాహన కూడా లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చట్టానికి కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
భూసేకరణ చట్టానికి- భూకొనుగోలుకు రూపొందించిన ఉత్తర్వుకు మధ్య వ్యత్యాసం ఏమిటో ముందు మంత్రులు తెలుసుకోవాలన్నారు. గురువారం ఇక్కడ మాజీ మంత్రులు డీకే అరుణ, చిత్తరంజన్‌దాస్, ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.