చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: అయిదేళ్లలో రాజధాని నిర్మించాలని నిర్ణయించినట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపి రాజధాని సలహా కమిటీ సభ్యులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 30వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. లాండ్పూలింగ్ ద్వారానే భూసేకరణ చేయనున్నట్లు చెప్పారు. భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోతే, భూసేకరణ చట్టం ప్రయోగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూ యజమానులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, నాలా ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
సమావేశంలో చర్చించిన ప్రకారం లాండ్పూలింగ్ ద్వారా రైతు నుంచి సేకరించిన భూమి అభివృద్ధి చేసిన తరువాత రైతుకు ఇచ్చేలోపల ఏడాదికి ఎకరానికి 25వేల రూపాయలు ఇస్తారు. ఈ నెల 30న జరిగే మంత్రి మండలి సమావేశంలో భూసేకరణకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. వెంటనే అమలులోకి తెస్తారు. భూసేకరణ చట్టం ప్రయోగిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు.
**