భూ సేకరణ చట్టం అమలుపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దంటున్న పవన్ కల్యాణ్ .... ఏం చేయాలో కూడా చెబితే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పరిహారం కోరాలి కానీ ...భూ సేకరణ వద్దంటే ఎలా అని యనమల ప్రశ్నించారు.