
భూములను బలవంతంగా లాక్కోనున్న ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని ప్రాంతంలో భూసేకరణకు ప్రభుత్వం రేపు నోటిఫికేషన్ ఇవ్వనుంది. 2014 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమి సేకరించనుంది.
నూతన రాజధానితో పాటు ఇతర పలురకాల అవసరాలకు కావలసిన భూమిని సేకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. భూసేకరణ చట్టం -2014 గా రూపొందించినదాని ప్రకారం మార్కెట్ విలువ ఆధారంగా భూమిని సేకరిస్తారు. అందుకు పరిహారంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కోసం నిర్ణయించిన ధరకు మూడు నుంచి నాలుగు రెట్లు వరకు ఇచ్చే అవకాశం ఉంది.
రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టం కొరడాను ఝులిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి వర్గ సభ్యులు మొదటి నుంచి బెదిరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా లాక్కోవడానికి ప్రభుత్వం సిద్ధపడింది.