
కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ అవసరం లేదా ? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..
పవన్‌కు పోలవరం ముంపు కనబడటం లేదా ? పవన్ ఏర్పాటు చేసిన ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీకి తెలంగాణకు ఇచ్చిన హామీలు కనబడవా? అని సూటిగా అడిగారు. పార్లమెంటులో జై ఆంధ్ర అన్న ఎంపీ కవితకు తెలంగాణ విభజన హామీలు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.
ఎర్రజొన్న, పసుపు, చిల్లి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని వ్యాఖ్యానించారు. బయ్యారం ఉక్కు, పోలవరం ముంపుపై మాట్లాడే చేవ లేదు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment