
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య రహస్య అవగా హన కుదిరిందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా, విభజన హామీలు అమలు చేయకపోయినా టీఆర్‌ఎస్‌ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఏపీకి అన్యా యం జరిగితే వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు పార్లమెంటులో పోరాడుతున్నారని చెప్పా రు. తెలంగాణకు అన్యాయం జరిగితే టీఆర్‌ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని, బీజేపీతో కుదిరిన అవగాహన ఏమి టని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను భౌతికంగా అంతం చేయడానికి కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.