
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే ప్రైవేటీకరణ తప్పదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే భూపాలపల్లిలో తాడిచర్ల కోల్డ్ బ్లాక్‌ను ప్రైవేటీకరించారని ఆరోపించారు. తాడిచర్లలోని రెండో బ్లాక్‌ను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.