
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అవినీతి, అక్రమాలు, స్కామ్‌ల మయమని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ స్కామ్‌లపై ప్రశ్నిస్తే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఎదురుదాడికి దిగిందన్నారు. ఏ సమస్యను ప్రశ్నించినా టీఆర్‌ఎస్ నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. శాసనసభా సమావేశాలను అత్యంత దారుణంగా నడిపారని అన్నారు. శాసనసభలో చర్చించిన అంశాలేవీ శాసనమండలిలో చర్చకు రాలేదన్నారు.