
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ ఏమైందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు.
ఆయన ఢిల్లీలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భద్రాచలంలోని రామాలయం సహా చాలా ఊళ్లు మునిగిపోయే ప్రమాదం ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.