
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని తెలంగాణకు చెందిన హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని, ఆ హామీలు రాష్ట్రానికి వర్తించవా అని మండలిలో సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రెండూ తనకు సమానమేనంటున్న పవన్ తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హామీలను సాధించడంలో టీఆర్‌ఎస్ ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 8 వేల ఎకరాల్లో, 20 వేల క్వింటాళ్ల కందులను రైతులు పండించారని, ఇప్పటిదాకా కేవలం 2 వేల క్వింటాళ్లను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మిగిలిన కందులను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.