మాట్లాడుతున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి
ఖమ్మం : సోనియా ఇచ్చిన తెలంగాణలో సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సినిమా చూపిస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మ ండిపడ్డారు. బుధవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయితీల్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. ఖమ్మం నగర పాలకం దుర్భరంగా మారిందని, కార్పొరేటర్లు తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, ప్రజలను మరిచిపోయారని స్వయాన ఇటీవల జిల్లా మంత్రి అన్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇటీవల సంకెళ్లు పడి జైలుకెళ్లిన రైతులపై ఇంకా కేసులు కొనసాగుతున్నాయని, ఆ విషయం పవన్‌కల్యాణ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. నేరేళ్ల ఘటన, భూపాలపల్లిలో దళితులపై దాడులు, తెలంగాణలో నిరుద్యోగంపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఖమ్మం ట్యాంక్‌బండ్ చాలా వరకు కబ్జా అయిందని, ఇక కేవలం 1/4 మాత్రమే మిగిలిందని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు మనోహర్‌నాయుడు, శరత్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఫజల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment