
కార్మికుల అరెస్టులు తగదు: పొంగులేటి
సింగరేణి వారసత్వ ఉద్యోగాల హామీని నెరవేర్చాలని, సమ్మెకు దిగిన వారిని అక్రమంగా అరెస్టు చేయడం తగదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాల హామీని నెరవేర్చాలని, సమ్మెకు దిగిన వారిని అక్రమంగా అరెస్టు చేయడం తగదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. వారసత్వ ఉద్యోగాలు వస్తాయని పెళ్లిళ్లు చేసుకున్న వారు విడాకులు తీసుకునే దుస్థితి వచ్చింద న్నారు. కార్మిక సంఘాలతో తక్షణమే చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెను భగ్నం చేయడానికి ప్రభు త్వం అక్రమ అరెస్టులు చేయడం, ప్రలోభ పెట్టడం వంటి కుట్రలకు దిగుతున్నదని పొంగులేటి ఆరోపించారు.