ఇసుక తవ్వకాల్లో అక్రమాలు నిరూపిస్తా: పొంగులేటి | Ponguleti comments on Sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాల్లో అక్రమాలు నిరూపిస్తా: పొంగులేటి

Published Sat, Apr 8 2017 2:35 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఇసుక తవ్వకాల్లో అక్రమాలు నిరూపిస్తా: పొంగులేటి - Sakshi

ఇసుక తవ్వకాల్లో అక్రమాలు నిరూపిస్తా: పొంగులేటి

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా గోదావరి నదిలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, మంత్రి కేటీఆర్‌ తనతో వస్తే నిరూపిస్తానని శాసన మండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సవాల్‌ చేశారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ.. గోదావరిలో రోడ్డు నిర్మించి, అసైన్డ్‌ భూముల్లోనూ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు.

ప్రశ్నించిన వారిపై ఇసుక మాఫియా దాడులకు దిగుతోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 6 మీటర్ల వరకు తవ్వు తున్నారని.. గనులు, అటవీ, పోలీసు యం త్రాంగం వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని మంత్రి కేటీఆర్‌ అనుచితంగా మాట్లాడటం తగదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement