
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యాపారం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులను లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 12వేలకు పైగా ప్రైవేటు విద్యాసంస్థలుండగా, 4వేల సంస్థలే ఆదా య, వ్యయ లెక్కలను చూపుతున్నాయని, మిగిలిన కళాశాలలపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేట్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల దోపిడీపై సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని, ఈ ఫీజుల దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కళాశాలలు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను నిబం« దనలకు విరుద్ధంగా అమ్ముకుంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు.