కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర వాటాను సాధించుకోకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపిం చారు.
పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర వాటాను సాధించుకోకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపిం చారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ ప్రజలు ఏ హక్కుల కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారో వాటిని సమకూర్చడంలో కేసీఆర్ విఫల య్యారన్నారు. పోలవరం రీడిజైన్ చేయాలని ఎన్నోసార్లు మాట్లాడిన సీఎం.. ఇప్పుడెం దుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి రివర్ అథారిటీలకు చంద్రబాబుకు సొంత అథారిటీలుగా మారి పోయాయని ఆరోపించారు.