హైదరాబాద్: ఓటుకు కుంభకోణం కేసు నుంచి బయటపడేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రాష్ట్రాల మధ్య కుట్రలు చేస్తున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంత చేయాలనడం కుట్రలో భాగమే అన్నారు. సీఎం కేసీఆర్ ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని.. వెంటనే అఖిల పక్షం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.