
'బాబు మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో పొంగులేటి సుధాకర్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్పై ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఆధారాలు చూపలేదని విమర్శించారు. సెక్షన్- 8 అంటూ గవర్నర్పై టీడీపీ మంత్రులు దాడి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలకు తెర తీశారన్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పొంగులేటి సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కేంద్రం రాజీ కుదిర్చుతున్నట్లు అనుమానంగా ఉందని పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు.