
ఇసుక మాఫియాను అడ్డుకోవాలి: పొంగులేటి
గోదావరి నదిలో బరితెగించి తోడుకుంటున్న ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిలో బరితెగించి తోడుకుంటున్న ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల అండదండలతో మాఫియా పెట్రేగిపోతోందని ఆరోపించారు.
ఆదాయం ఎక్కువగా వస్తున్నదనే సాకుతో అధికారులు అడ్డదారుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అమాయక గిరిజనులతో సొసైటీలను ఏర్పాటు చేయించి, వాటి పేరుతో ఇసుక తవ్వకాలను చేపడుతు న్నారని పొంగులేటి ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో భ్రమల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. భద్రాచలం భూములు మునుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.