
మోదీ దృష్టిలో పడేందుకే ఆరాటం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్ర బాబు, కేసీఆర్ అనుక్షణం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు
సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్ర బాబు, కేసీఆర్ అనుక్షణం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు ఆరాటపడుతున్నారని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవికి విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించకముందే చంద్రబాబు, కేసీఆర్‌లు.. బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారన్నారు.
ఇదంతా మోదీ దృష్టిలో పడేందుకేనని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లోనూ రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సరైన వ్యవస్థ ఏర్పాటు చేయకుండా జీఎస్టీని అమలు చేస్తే ఇబ్బందులు తప్పవన్నారు. ఎరువులపై పన్నుల వల్ల రైతులపై మరింత భారం పడుతుందని, వ్యవసాయరంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.