
రుణాల అవకతవకలపై విచారణ: పొంగులేటి
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఐవోబీ రుణాల్లో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఐవోబీ రుణాల్లో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ భూమి ఒకరిదైతే రుణాలు వేరేవాళ్లకు ఇచ్చారని ఆరోపించారు. మధ్యదళారీలు, బ్యాంకు అధికారులు కలసి రైతుల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. రైతు రుణాలపై ఐఏఎస్ అధికారిని నియమించి, పర్యవేక్షణ జరిపించాలని పొంగులేటి కోరారు. డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.