రైతులతో ఆడుకుంటున్నాయి
బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై పొంగులేటి ఫైర్
సాక్షి, హైదరాబాద్: మిర్చికి మద్దతు ధర విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ కలసి రైతులతో ఆడుకుంటున్నాయని శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రెండు పార్టీలూ రాజకీయాల కోసం రైతులతో దోబూచులాడుతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వ్యాపారులు, దళారులు మధ్య రైతులు నష్టపోతున్నారన్నారు. ఖమ్మంలో జరిగిన ఘటనపై న్యాయ విచారణ వేయాలని మంత్రి హరీశ్‌రావును కోరినట్టుగా తెలిపారు. రైతులపై కేసులు పెట్టి వేధించడం సరికాదని, వెంటనే వారిపై కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.