ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రైతు సమన్వయ సమితిల పేరుతో చిచ్చుపెడుతున్నారని శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
పొంగులేటి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రైతు సమన్వయ సమితిల పేరుతో చిచ్చుపెడుతున్నారని శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కిలాడీతనంతో కొత్త వాగ్దానాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిననే స్పృహతో కేసీఆర్ వ్యవహరించాలన్నారు. భూపాలపల్లి జిల్లాలో గిరిజనులపై పోలీసులు దాడి చేయడం దారుణమ న్నారు. వైశ్యులను అవమానించే విధంగా వ్యవహరించిన కంచ ఐలయ్య తీరుపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి లేకుండా మద్యం దుకాణాలను మాత్రం విచ్చలవిడిగా పెంచుతోందన్నారు.