
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కిలాడీ రాజకీయాలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి అని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటిని పట్టించుకోకుండా, తన రహస్య ఎజెండాతో జాతీయస్థాయి ఫ్రంట్ అంటూ చర్చనంతా తన చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.