
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య చిచ్చుపెట్టేలా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆంధ్రా వాళ్లు ఏపీలోనే పన్నులు చెల్లిస్తే అక్కడి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందంటూ రాజీవ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
రాజీవ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను మొత్తం సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసినట్టుగా చెప్పుకోవడం బాధాకరమన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు.