
ఉగ్రవాదాన్ని పారదోలుదాం
అహిం సాయుతంగా చేసిన ఉద్య మాలతో స్వాతంత్య్రం సాధించిన దేశంలో ఉగ్ర వాదానికి స్థానంలేకుండా చేయాలని శాసనమండలి కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు.
పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అహిం సాయుతంగా చేసిన ఉద్య మాలతో స్వాతంత్య్రం సాధించిన దేశంలో ఉగ్ర వాదానికి స్థానంలేకుండా చేయాలని శాసనమండలి కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు.
అంతర్జాతీయ యువజన దినోత్స వాన్ని పురస్కరించుకుని తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్ గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. మతతత్వానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. మాజీ మంత్రి దానం నాగేందర్, టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, నేతలు గురజాల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.